హైదరాబాద్: 28°C
వార్తలు

త్రాగునీరు పైప్ లైన్ పరిశీలించిన కౌన్సిలర్

WNP: అమృత్ 2.0 పథకం ద్వారా అమరచింత మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని 8వ వార్డు కౌన్సిలర్ ఎం. రాజు తెలిపారు. మున్సిపాలిటీలో జరుగుతున్న పైపులైన్, వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద తాగునీటి సౌకర్యాల కోసం నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.