హైదరాబాద్: 28°C
వార్తలు

మేడిగడ్డపై రేవంత్ అబద్ధాలు చెబుతున్నారు: పువ్వాడ

TG: బీఆర్ఎస్ హయాంలో సింగరేణి లాభాల్లో నడిచిందని మాజీమంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందించామన్నారు. మేడిగడ్డపై సీఎం రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. భద్రాచలం మునిగిపోతుందనడం సరికాదని పేర్కొన్నారు. నీళ్లను పక్కరాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు.