హైదరాబాద్: 28°C
వార్తలు

పంట కాలువ నిర్మాణ పనులు పరిశీలన

అనకాపల్లిలో చెర్లోపల్లి పంట కాలువ నిర్మాణ పనులను ఇవాళ నియోజకవర్గం జనసేన సమన్వయకర్త భీమరశెట్టి రాంకి పరిశీలించారు. నాణ్యతతో పనులు జరగాలని సూచించారు. కాలువ నిర్మాణానికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చొరవతో నిధులు మంజూరైనట్లు తెలిపారు. పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలో సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచే విధంగా పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.