హైదరాబాద్: 28°C
వార్తలు

అసంపూర్తి పనులతో ప్రజలకు ఇబ్బందులు

KMR:సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు మధ్య లోనే నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పనులు అసంపూర్తిగా ఉండటంతో రోడ్లపై దుమ్ము, ధూళి ఎగసిపడుతూ వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తెలిపారు. వెంటనే పనులు పునఃప్రారంభించి పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.