హైదరాబాద్: 28°C
వార్తలు

'బాధితులకు మెరుగైన వైద్యం అందించండి'

BDK: హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములకలపల్లి మండలం కొత్త గంగారం గ్రామానికి చెందిన లక్ష్మి చైత్రను ఎమ్మెల్యే ఆదినారాయణ పమర్శించారు. ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యం గురించి డాక్టర్లతో మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలన్నారు.