హైదరాబాద్: 28°C
వార్తలు

'70 స్థానాలతో అధికారంలోకి వస్తాం'

KMR: TGలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 70 స్థానాలు సాధించి అధికారంలోకి వస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. యువత బీజేపీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకలా, రాష్ట్రంలో మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 117 సీట్లు గెలుస్తామన్న కాంగ్రెస్ వాదన హాస్యాస్పదమని పేర్కొన్నారు.