హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆదానీ, అంబానీలకు దేశం అప్పగిస్తున్నారు'

TG: కేంద్రంపై యువత అసంతృప్తితో ఉన్నారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అని నిలదీశారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తున్నారని మండిపడ్డారు. ఆదానీ, అంబానీలకు దేశం అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగాలు 20 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. యువత ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.