హైదరాబాద్: 28°C
వార్తలు

రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

NLR: నెల్లూరు నగరంలోని వేదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రౌడీషీటర్ ప్రవర్తనపై నిరంతరం నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.