హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్చరీ రజత విజేతలకు మంత్రి మండిపల్లి అభినందనలు

AP: స్పెయిన్‌లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-4 పోటీల్లో రజత పతకం సాధించిన భారత మహిళల కాంపౌండ్ జట్టుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ టోర్నీలో భారత క్రీడాకారిణులు జ్యోతి సురేఖ, పృతిక ప్రదీప్, చికిత తనిపర్తి అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారని, భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.