హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ నిలిపివేత

RR: చంపాపేట విద్యుత్ విభాగం పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11 కేవీ పద్మానగర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. పద్మానగర్, క్రాంతినగర్, నిర్మల్‌నగర్, జ్యోతినగర్, కర్మన్‌ఘాట్, రాఘవేంద్ర కాలనీ, హనుమాన్‌నగర్ తదితర ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని ఏఈ శ్రీనివాస్ తెలిపారు.