హైదరాబాద్: 28°C
వార్తలు

జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో భారీ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో స్థానిక ఆపిల్‌ తోటలు, వరి పంటలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రవాణా, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితి విషమించడంతో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాల్లోని షెల్టర్స్‌లో తలదాచుకుంటున్నారు.