హార్మూజ్ జలసంధిలో సైప్రస్ జెండాతో వెళ్తున్న ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. నౌకలపై దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేసింది. ఈ నౌకలో మొత్తం 11 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో ఓ భారతీయడు గల్లంతవ్వగా, మిగిలిన 10 మంది సురక్షితంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వార్తలు
ఇరాన్ దాడిని తీవ్రంగా ఖండించిన భారత్


