హైదరాబాద్: 28°C
వార్తలు

మండవల్లిలో 'SIR' ప్రక్రియ పూర్తి..!

ELR: మండవల్లి మండలంలో ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ ఆదివారం 93.84 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయ్యిందని తహసీల్దార్ బాజీ సత్యనారాయణ తెలిపారు. మండలంలో 39,562 మంది ఓటర్లు ఉండగా, 37,128 మందికి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశామని పేర్కొన్నారు. మిగిలిన వారిలో మృతులు 1,408 మంది, శాశ్వత వలస వెళ్లిన వారు 679 మంది, డబుల్ ఎంట్రీ 214 మంది ఉన్నారన్నారు.