ప్రకాశం: ఒంగోలులో ఆదివారం జరిగిన ప్రమాదంలో కానిస్టేబుల్ మృతిపట్ల మంత్రి గొట్టిపాటి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో కానిస్టేబుల్ మృతిపై జిల్లా ఎస్పీతో మంత్రి మాట్లాడారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వార్తలు
కానిస్టేబుల్ మృతి పట్ల మంత్రి దిగ్భ్రాంతి!


