హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎన్యూమరేషన్ నమోదు పెంచాలి'

NZB: కమ్మర్‌పల్లి మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియను అదనపు కలెక్టర్ భుజంగరావు పరిశీలించారు. కమ్మర్పల్లి, మనాల గ్రామాల్లో ఎన్యూమరేషన్ నమోదు తక్కువగా ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ప్రత్యేక దృష్టి సారించి నమోదును మెరుగుపరచాలన్నారు. గడువులోగా వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష్యం పూర్తిచేయడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు.