NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి గాంధీగుడి పూజారి కూరెళ్ల నరసింహాచారి జ్యోతిష శాస్త్రంలో చేస్తున్న పరిశోధనలకు గుర్తింపుగా 'జ్యోతిష ఆచార్య' అవార్డును అందుకున్నారు. చీరాలకు చెందిన ఈశ్వర నారాయణ ఆస్ట్రో రీసర్చ్ అకాడమీ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను అభినందించారు.
వార్తలు
నరసింహాచారికి 'జ్యోతిష ఆచార్య' అవార్డు


