హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అక్రమ మద్యం విక్రయాలు ఆపాలి: వేణురెడ్డి

సత్యసాయి: హిందూపురం పట్టణంలోని కొట్నూరు సమీపంలో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ హిందూపురం వైసీపీ ఇన్ ఛార్జ్ దీపిక ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం నిరసన చేపట్టారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బాలాజీ అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు చేస్తున్నారని వేణురెడ్డి ఆరోపించారు. బాలాజీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.