పబ్లిక్ శ్మశాన వాటికల్లో ఏ ఒక్క సమాధిపైనా ఎవరికీ ప్రత్యేక హక్కులు ఉండవని ఢిల్లీలోని సాకేత్ కోర్టు స్పష్టం చేసింది. షాహీన్ బాగ్ కబరస్థాన్‌లోని తన భార్య సమాధిని మరొకరి అంత్యక్రియల కోసం ఉపయోగించకుండా నిలువరించాలని ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ భూమి అందరి అవసరాల కోసం ఉందని దీనిని ఒక వ్యక్తి ప్రయోజనం కోసం రిజర్వే చేయలేమని తేల్చి చెప్పింది.
వార్తలు
భార్య సమాధిపై భర్తకు హక్కులు లేవు: కోర్టు


