హైదరాబాద్: 28°C
వార్తలు

పొంచి ఉన్న ప్రమాదం

WNP: వీపనగండ్ల మండలం పుల్గర్‌చర్ల గ్రామ శివారులో విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌‌కు రక్షణ కంచె లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు లేక రైతులు, పశువులకు ముప్పు ఉందని తెలిపారు. విద్యుత్‌ శాఖ అధికారులు వెంటనే ట్రాన్స్‌ ఫార్మర్‌ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.