హైదరాబాద్: 28°C
వార్తలు

'14న ఉపాధ్యాయుల భారీ ధర్నా'

NZB: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నల్ల కిషన్ రెడ్డి, డింగరి మధుసూదనాచారి తెలిపారు. ఆదివారం ఆయన ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. ఉపాధ్యాయులు, విద్యా రంగానికి సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించాలన్నారు.