హైదరాబాద్: 28°C
వార్తలు

మేడిగడ్డపై సీఎం చెప్పేవన్నీ అవాస్తవాలే: హరీష్ రావు

TG: వాస్తవాలు మాట్లాడిన వారిని జైలులో పెడతానంటూ భయపెడుతున్నారని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద హైదరాబాద్ సహా అనేక జిల్లాలు ఆధారపడ్డాయని తెలిపారు. రాజకీయాలకు పోయి కరువు సమస్యను జఠిలం చేయొద్దని హితవు పలికారు. నీళ్ల విషయంలో ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఊరుకునేది లేదన్నారు. మేడిగడ్డపై సీఎం రేవంత్ చెప్పేవన్నీ అవాస్తవాలే అని విమర్శించారు.