అన్నమయ్య: రామాపురం మండలం గడికోట బీట్‌లోని తడకోన అటవీ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారు తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన హరిమూర్తి, తిరువణ్ణామలై జిల్లాకు చెందిన సెట్టుగా గుర్తించారు.
వార్తలు
తడకోన అడవిలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్


