మంచి నీళ్లు అనుకుని ఓ యువతి యాసిడ్ తాగిన ఘటన UPలో జరిగింది. ఆభరణాలు కొనుగోలు చేయడానికి బాధితురాలు దుకాణానికి వెళ్లింది. ఆ టైంలో దాహం వేయడంతో షాపు యాజమానిని ఆమె వాటర్ అడగగా.. అతను పక్క షాపు నుంచి తెప్పించాడు. ఆ నీళ్ల బాటిల్ తెరిచి తాగగా.. నోరు మండటంతో వాటిని ఊసేసింది. ఆ బాటిల్‌లో ఉన్నది యాసిడ్ అని గ్రహించి యువతిని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
వార్తలు
నీళ్లు అనుకుని యాసిడ్ తాగిన యువతి


