పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. యాత్ర ప్రారంభమైన తొలి 8 రోజుల్లోనే రెండు లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. మరో రెండు రోజుల్లో వీరి సంఖ్య రెండున్నర లక్షలు దాటవచ్చని అధికారులు తెలిపారు. భక్తుల రాక ఇలాగే కొనసాగితే 57 రోజుల ఈ యాత్రలో ఈ సారి కొత్త రికార్డు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వార్తలు
రెండున్నర లక్షల మార్క్‌కు చేరువలో భక్తుల తాకిడి


