హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని పిచ్చుక లంక గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాటులను ఆదివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారని ఈ సందర్భంగా అధికారులు ఏర్పాట్లను విజయవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.