హైదరాబాద్: 28°C
వార్తలు

రవాణా మంత్రినే బస్సు దింపేసిన కండక్టర్

రవాణాశాఖ మంత్రినే బస్సు నుంచి కిందకు దింపిన ఘటన బెంగళూరులో జరిగింది. బస్సుల్లో తనిఖీలో భాగంగా మంత్రి హెబ్బాళ్‌లో బస్సు ఎక్కి రెండు టికెట్లు ఇవ్వాలని రూ.100 నోటు ఇచ్చారు. మంత్రిని గుర్తించని కండక్టర్ చిల్లర ఇవ్వాలని కోరగా.. తన వద్ద లేదని మంత్రి చెప్పాడు. తన వద్ద కూడా లేదని.. చిల్లర లేకపోతే బస్సు దిగాలని కండెక్టర్ చెప్పాడు. దీంతో ఏం మాట్లాడకుండానే మంత్రి దిగిపోయారు.