హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్మూర్​లో కార్డన్​ సెర్చ్​.. వాహనాలు స్వాధీనం

NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని నల్ల పోచమ్మ గల్లీలో ఇవాళ పోలీసులు కార్డన్​ సెర్చ్​ నిర్వహించారు. ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సెర్చ్​లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 50 బైక్​లను, మూడు ఆటోలను సీజ్ ​చేశారు. అనంతరం SHO మాట్లాడుతూ.. ప్రతి వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు.