ELR: ఏలూరు నగరంలోని సీనియర్ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్ నివాసం వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన కుమారుడి పుట్టినరోజు వేడుకలను పోలీసులు అడ్డుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రైవేట్ స్థలంలో జరిగే కార్యక్రమానికి కూడా అనుమతి లేదని పోలీసులు చెప్పడంపై వారు మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ రాజకీయ దుర్వినియోగమేనని కుటుంబ సభ్యులు విమర్శించారు.
వార్తలు
ఏలూరులో ఉద్రిక్తత: న్యాయవాది ఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు


