హైదరాబాద్: 28°C
వార్తలు

కార్డన్ అండ్ సెర్చ్.. 80 వాహనాలు సీజ్

SRPT: పట్టణంలోని చర్చికాంపౌండ్ కాలనీలో ఆదివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. DSP ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో 100 మంది పోలీసులు ఇంటింటా తనిఖీలు నిర్వహించి, సరైన పత్రాలు లేని 80 వాహనాలను సీజ్ చేశారు. నేరాల నియంత్రణ, భద్రత కోసమే ఈ ఆపరేషన్ నిర్వహించామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని DSP కోరారు.