ATP: గుంతకల్లులోని హజరత్ మస్తాన్ వలి 391వ ఉరుసు ఉత్సవాలలో భాగంగా ఆదివారం 3వ రోజు జియారత్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వామివారి గంధాన్ని గుర్రంపై కొలువు తీర్చి పట్టణంలోని పురవీధులకుండా ఊరేగింపు నిర్వహించారు. దర్గాలో ప్రత్యేక చక్కెర చదివింపులు చేశారు. కులమతాలకతీతంగా ఉన్న ఈ ఉరుసుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
వార్తలు
భక్తిశ్రద్ధలతో స్వామివారి షంషేర్ ఊరేగింపు


