హైదరాబాద్: 28°C
వార్తలు

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్ల అరెస్ట్

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన షూటర్లను ఢిల్లీ రోహిణి జిల్లా ప్రత్యేక పోలీసు దళం అరెస్ట్ చేసింది. పక్కా సమాచారం మేరకు రైడ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా టార్గెట్ కిల్లింగ్ కోసం పథక రచన చేస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్న నెట్‌వర్క్ ద్వారా ఈ షూటర్లకు ఆదేశాలు వచ్చినట్లు గుర్తించారు. గతంలోనూ వీరు నిర్దేశిత లక్ష్యాలపై కాల్పులు జరిపినట్లు చెప్పారు.