హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: ఐదుగురు మృతి

మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విషాదం చోటుచేసుకుంది. లాపాలాంగ్ ప్రాంతంలోని ఓ బావిలో దిగి కూలీలు పని చేస్తున్న సమయంలో విష వాయువులు లీకై ఐదుగురు మృతి చెందారు. మరొకరు బయటపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసుసు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.