SRCL: బోయినపల్లి మండలం విలాసాగర్ నుండి దేశాయిపల్లి కాల్వ బ్రిడ్జి వరకు బీటీ రోడ్డు నిర్మించాలని సీపీఎం మండల కమిటీ కోరింది. ఈ రహదారి అందుబాటులోకి వస్తే పరిసర గ్రామాల ప్రజలకు వేములవాడకు ప్రయాణ దూరం తగ్గి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని మండల కన్వీనర్ శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.
వార్తలు
బీటీ రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి


