హైదరాబాద్: 28°C
వార్తలు

హైకోర్టు సంచలన తీర్పు

ప్రసూతి సెలవులపై జమ్మూకశ్మీర్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రసూతి సెలవులు రాజ్యాంగబద్ధంగా మహిళలకు దక్కే హక్కు అని స్పష్టం చేసింది. వాటిని ప్రభుత్వం ఇచ్చే దానంగా చూడలేమని వెల్లడించింది. వారికి చెల్లించాల్సిన ప్రసూతి సెలవుల వేతనాన్ని పనిచేయలేదనే ఉత్తర్వుల పేరుతో రద్దు చేయలేమని పేర్కొంది. వెంటనే మహిళలకు ప్రసూతి సెలవుల జీతాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.