హైదరాబాద్: 28°C
వార్తలు

తల్లితో పాటు పిల్లల అదృశ్యంపై కేసు నమోదు

WG: ఇరగవరం మండలం తూర్పువిప్పర్రుకు చెందిన ఉన్నమట్ల రోజా తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైనట్లు SI నసీరుల్లా ఆదివారం తెలిపారు. ఈ నెల 10న రాత్రి సమయంలో ఆరేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తెతో కలిసి ఆమె కనిపించకుండా పోయారు. దీనిపై భర్త ఉన్నమట్ల శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వెల్లడించారు.