హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళను అసభ్యకర రీతిలో ఫోటోలు తీసిన ఇద్దరిపై కేసు

W.G: ఒక మహిళను అసభ్యకర రీతిలో ఫోటోలు తీసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఇరగవరం SI నసీరుల్లా తెలిపారు. రేలంగి ప్రాంతంలో ఓ మహిళ స్నానం చేస్తుండగా నిందితులు అసభ్యకర ఫోటోలు తీశారని బాధితురాలి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 15న జరిగిన ఈ ఘటనపై శనివారం రాత్రి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.