హైదరాబాద్: 28°C
వార్తలు

'అందుబాటులో యూరియా బుక్ చేసుకోండి'

KMR: నిజాంసాగర్ మండలం అచ్చంపేట సొసైటీ పరిధిలోని నర్సింగ్రావుపల్లి-అచ్చంపేట గోదాంలో యూరియా ఎరువు అందుబాటులో ఉందని నిజాంసాగర్ మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్ ఆదివారం తెలిపారు. రైతులు తప్పనిసరిగా యాప్ ద్వారా ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని యూరియాను పొందాలని సూచించారు. అవసరమైన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.