హైదరాబాద్: 28°C
వార్తలు

విజయవాడ యువతిపై యువకుడి వేధింపులు..!

NTR: విజయవాడ ప్రసాదంపాడులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే యువతి, అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ప్రదీప్ తనను వేధిస్తున్నాడని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పేరుతో పాటలు పాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ప్రశ్నించగా అతను దుర్భాషలాడాడని తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.