హైదరాబాద్: 28°C
వార్తలు

వాంగ్‌చుక్ దీక్ష.. ప్రకాష్ రాజ్ మద్దతు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్‌కు నటుడు ప్రకాశ్ రాజ్ మద్దతు తెలిపారు. దేశ యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ పోరాటంలో తామంతా అండగా ఉంటామని తెలిపారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలంటూ జూలై 20న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహిస్తున్నామని.. దీనిలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.