గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం గిర్నార్ కొండపై కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనానికి వెళ్తున్న 11 ఏళ్ల బాలుడిపై సింహం ఒక్కసారిగా దాడి చేసింది. అనంతరం అడవిలోకి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న వందలాది మంది భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సింహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వార్తలు
భక్తుల కళ్లెదుటే బాలుడిని చంపిన సింహం


