హైదరాబాద్: 28°C
వార్తలు

'వసతులు లేక అష్ట కష్టాలు పడుతున్న విద్యార్థులు'

NLR: చదువు కోసం వచ్చి విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు. వసతులు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. వింజమూరు (m) చాకలికొండ గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహంలోని 40 మంది విద్యార్థుల దయనీయ పరిస్థితి ఇది. శిధిలావస్థకు చేరిన ఈ వసతి గృహానికి కిటికీలకు తలుపులు లేకపోవడంతో దోమలు, ఇతర కీటకాలు గదుల్లోకి చేరడంతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.