హైదరాబాద్: 28°C
వార్తలు

యుద్ధాల స్వభావం మారుతోంది: కేంద్రమంత్రి

యుద్ధాల స్వభావం వేగంగా మారుతోందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. భవిష్యత్తులో యుద్ధాలు ఏఐతో జరగవచ్చన్నారు. కానీ ఈ పోరులో విజయాన్ని సాధించేది మాత్రం జాతీయ సంకల్పం, సమర్థులైన జవాన్లు, తిరుగులేని మన సైనిక శక్తి మాత్రమేనని పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీ, సంప్రదాయ రక్షణ వ్యవస్థలు ఒకదానికొకటి వ్యతిరేకం కాదని, అవి ఒకదానికొకటి తోడుగా నిలుస్తాయని చెప్పారు.