హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఐటీఐలో అప్రెంటిస్‌షిప్ మేళా

KMR: బిచ్కుంద ప్రభుత్వ ఐటీఐలో రేపు ఉదయం 10 గంటలకు 'ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌‌షిప్ మేళా' నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రమోద్ కుమార్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరుకావాలన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.