హైదరాబాద్: 28°C
వార్తలు

జడ్చర్లలో వేగంగా డ్రైనేజీ, రోడ్డు నిర్మాణ పనులు

MBNR: భారీ వర్షాల సమయంలో వరద, బురద నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా జడ్చర్ల మున్సిపాలిటీలో డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పనుల కారణంగా ప్రజలు కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పటికీ, త్వరలోనే రోడ్డు పూర్తిగా అందుబాటులోకి రానుంది. పనులు పూర్తయితే వరద నీటి ఇబ్బందులు తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలకు కూడా ఉపశమనం లభించనుంది.