హైదరాబాద్: 28°C
వార్తలు

శస్త్ర చికిత్సలు వికటించి 8 మంది మృతి

రాజస్థాన్‌లో దారుణ ఘటన జరిగింది. భిల్వారా, బన్‌స్వారా జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసూతి, గైనకాలజీ విభాగాల్లో శస్త్రచికిత్సలు చేయించుకున్న వారంలోపే 9 మంది మృతి చెందారు. వీరిలో భిల్వారాలోని గాంధీ ఆసుపత్రిలో ఐదుగురు మహిళలు, బన్‌స్వారాలో ముగ్గురు మహిళలు, ఓ బాలిక కన్నుమూసినట్లు అధికారులు తెలిపారు. దీంతో తల్లులు ఆరోగ్య సంరక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది.