హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్.. 10 మందికి జైలు

KKD: మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 22 మంది పట్టుబడ్డారని ఎస్ఐ రఘునాథరావు తెలిపారు. పెద్దాపురం కోర్టులో హాజరుపరచగా 12 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా, మరో 10 మందికి ఐదు రోజుల జైలు శిక్ష విధించగా, వారిని పెద్దాపురం సబ్‌జైలుకు తరలించారు.