KKD: జగ్గంపేట నియోజకవర్గం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై బూటకపు గ్రామసభలు నిర్వహిస్తే సహించేది లేదని సామాజికవేత్త పాఠంచెట్టి సూర్య చంద్ర హెచ్చరించారు. ఈ పరిశ్రమ వల్ల తీవ్ర పర్యావరణ ప్రమాదం వాటిల్లుతుందన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నెల 14న జరిగే గ్రామసభలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు.
వార్తలు
బూటకపు గ్రామసభలు నిర్వహిస్తే సహించేది లేదు


