MNCL: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో ఓ బొగ్గు వ్యాగన్ రైల్లో మంటలు చెలరేగాయి. మంటలార్పే క్రమంలో రామగుండానికి చెందిన రైల్వే కూలీ ఇస్లావత్ భిక్షపతి(18)పై వేడి నీరు పడటంతో చర్మం ఊడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన ఫైర్ సిబ్బంది వెంటనే క్షతగాత్రుడిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నాడు.
వార్తలు
రైల్వే కూలీకి తీవ్ర గాయాలు


