హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపాధ్యాయులకు రేపటి నుంచి శిక్షణ: DEO మాధవి

ADB: ఉపాధ్యాయులు తమ వృత్తిలో రాణించేలా, మెరుగైన బోధన పద్ధతులను అనుసరించేలా ఈ నెల 13నుంచి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఈవో మాధవి శనివారం తెలిపారు. ఈ శిక్షణ తరగతులు వచ్చే ఆగస్టు 8వ తేదీ వరకు కొనసాగుతాయని అన్నారు. ఇందులో భాగంగా ఒక్కో ఉపాధ్యాయుడికి 3 రోజుల చొప్పున శిక్షణ ఇస్తామని వివరించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.