హైదరాబాద్: 28°C
వార్తలు

'ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ దృష్టి సారించాలి'

KNR: కరీంనగర్‌లో జరిగిన బధిర ఉద్యోగుల రాష్ట్ర సంఘం 10వ వార్షికోత్సవంలో టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వినికిడి లోపం ఉన్న ఉద్యోగులు ప్రతిభతో విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. వారి పదోన్నతులు, బదిలీలు, ఇతర ఉద్యోగ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.